Posts

MANAKU VACHE COMMON SANDHEHALAKU DEVUDU SWAYANGA SAMADHANAMISTHE.............!

Contributed by Sairam Nedunuri కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కన ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని. ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది. తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను. ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య M. S. Subbu Lakshmi గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది ప్రదక్షిణ చేస్తున్నారు. ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు . కొంత మంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది తన్మయత్వం తో దేవుడిని చుస్తూ ఉండిపోయారు. దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యం కి ఇంకొంచెం సమయమే